twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా, అల్లరి నరేష్, మనోజ్ ‘డీకె బోస్’ ఆడియో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'DK బోస్'. రాండమ్ థాట్స్ బేనర్ పై శేషురెడ్డి, ఆనంద్ రంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఎన్ బోస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అచ్చు సంగీతం అందించారు. సందీప్ కిషన్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సందీప్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

    ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన కీరవాణి, రాణా, మంచు మనోజ్, అల్లరి నరేష్, ఆది, నవదీప్ తదితరులు ఆడియోను, థియేట్రికల్ ట్రైలర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ...'నేను నటిస్తున్న మాస్, కమర్షియల్ సినిమా ఇది. చాలా క్రియేటివ్ గా సినిమా తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది' అన్నారు.

    అచ్చు అందించిన సంగీతం బాగుందని, ఆయన వేంగంగా బాణీలు కడుతున్నాడని, మంచి భవిష్యత్ ఉన్న సంగీత దర్శకుడని కీరవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీవీఎస్ రవి, మారుతి, డార్లింగ్ స్వామి, రమేష్ పుప్పాల, సింగర్ మధు, రెజీనా, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.

    సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈచిత్రంలో బ్రహ్మాజీ, సంపత్ కుమార్, సప్తగిరి, కోట శంకర్ రావు, రవి వర్మ, సత్తన్న, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు, కెమెరా : విశ్వేశ్వర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : హరి వర్మ, నిర్మాతలు : ఆనంద్ రంగా, శేషురెడ్డి, దర్శకత్వం : ఎ.ఎన్. బోస్.

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    డికె బోస్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    రెజీనా, రకూల్ ప్రీత్ సింగ్ లతో సందీప్ కిషన్

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    అల్లరి నరేష్, మనోజ్, ఆది, సందీప్ కిషన్, నవదీప్, రానా

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    నవదీప్, బ్రహ్మాజీ, అల్లరి నరేష్, మధుశాలిని చిట్ చాట్

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    ఆడియో వేడుకలో రానా, మనోజ్ సందడి

    రానా, అల్లరి నరేష్, మనోజ్ @ ‘డీకె బోస్’ ఆడియో

    సందీప్ కిషన్, నిషా అగర్వాల్

    English summary
    Sundeep Kishan DK Bose starring in the direction of a debutant AN Bose had its audio launched on May 7 at Durgam Cheruvu in Hyderabad. Seshu Reddy, Anand Ranga are producing the film jointly and Nisha Agarwal is pairing with Sundeep Kishan in this youthful entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X