Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రానా, అల్లరి నరేష్, మనోజ్ ‘డీకె బోస్’ ఆడియో
హైదరాబాద్ : సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'DK బోస్'. రాండమ్ థాట్స్ బేనర్ పై శేషురెడ్డి, ఆనంద్ రంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఎన్ బోస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అచ్చు సంగీతం అందించారు. సందీప్ కిషన్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సందీప్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన కీరవాణి, రాణా, మంచు మనోజ్, అల్లరి నరేష్, ఆది, నవదీప్ తదితరులు ఆడియోను, థియేట్రికల్ ట్రైలర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ...'నేను నటిస్తున్న మాస్, కమర్షియల్ సినిమా ఇది. చాలా క్రియేటివ్ గా సినిమా తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది' అన్నారు.
అచ్చు అందించిన సంగీతం బాగుందని, ఆయన వేంగంగా బాణీలు కడుతున్నాడని, మంచి భవిష్యత్ ఉన్న సంగీత దర్శకుడని కీరవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీవీఎస్ రవి, మారుతి, డార్లింగ్ స్వామి, రమేష్ పుప్పాల, సింగర్ మధు, రెజీనా, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.
సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈచిత్రంలో బ్రహ్మాజీ, సంపత్ కుమార్, సప్తగిరి, కోట శంకర్ రావు, రవి వర్మ, సత్తన్న, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు, కెమెరా : విశ్వేశ్వర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : హరి వర్మ, నిర్మాతలు : ఆనంద్ రంగా, శేషురెడ్డి, దర్శకత్వం : ఎ.ఎన్. బోస్.
డికె బోస్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
రెజీనా, రకూల్ ప్రీత్ సింగ్ లతో సందీప్ కిషన్
అల్లరి నరేష్, మనోజ్, ఆది, సందీప్ కిషన్, నవదీప్, రానా
నవదీప్, బ్రహ్మాజీ, అల్లరి నరేష్, మధుశాలిని చిట్ చాట్
ఆడియో వేడుకలో రానా, మనోజ్ సందడి
సందీప్ కిషన్, నిషా అగర్వాల్