MICHAEL Twitter Review: మైఖేల్‌కు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. సందీప్‌ హిట్ కొట్టాడా అంటే!

మంచి టాలెంట్ ఉన్నా.. హిట్లు అందుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడమో.. మరో కారణమో తెలియదు కానీ.. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు.

అందులో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా హిట్లను పెద్దగా అందుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడతను 'మైఖేల్' అనే క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

మైఖేల్‌గా వచ్చేసిన యంగ్ హీరో

మైఖేల్‌గా వచ్చేసిన యంగ్ హీరో

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రమే 'మైఖేల్'. రంజిత్ జయకోడి తెరకెక్కించిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించడగా.. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు నటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు.

అలాంటి స్టోరీతో వచ్చిన చిత్రం

అలాంటి స్టోరీతో వచ్చిన చిత్రం

కెరీర్ ఆరంభం నుంచి తనదైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్న సందీప్ కిషన్.. ఇప్పుడు 'మైఖేల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం 90వ దశకం నాటి ప్రేమకథతో ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందినట్లు తెలిసింది. విడుదలకు ముందు వచ్చిన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

మైఖేల్ మూవీకి ట్విట్టర్‌లో టాక్

మైఖేల్ మూవీకి ట్విట్టర్‌లో టాక్

విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న సందీప్ కిషన్ 'మైఖేల్' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది కొందరు బాగుందని, మరికొందరు బాలేదని అంటున్నారు.

ఒక్కో సీన్ చాలా హైలైట్‌గా ఉంది

సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అందులో 'మైఖేల్ మూవీలో ఒక్కో సీన్ చాలా హైలైట్‌గా ఉంది. హీరో సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ ఊరమాస్. అన్ని క్యారెక్టర్లనూ చాలా బాగా చూపించారు. ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్ చేశా. నాకు చాలా నచ్చింది' అంటూ చెప్పుకొచ్చాడు.

మైఖేల్ హృదయాలు గెలిచాడు

సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి తెరకెక్కించిన 'మైఖేల్' మూవీని చూసిన మరో నెటిజన్ 'మైఖేల్ మన అందరి హృదయాలను గెలుచుకున్నాడని చెప్పొచ్చు. సినిమా, అందరి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఇంత మంది స్టార్లను ఇందులో నటింపజేసినందుకు యంగ్ డైరెక్టర్‌ను కచ్చితంగా అభినందించాల్సిందే' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

మూవీ హిట్ అయిపోయిందని

సందీప్ కిషన్ - దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన 'మైఖేల్' మూవీ తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ఇంకో నెటిజన్ తన ట్విట్టర్‌లో 'సందీప్ కిషన్ అన్నా కంగ్రాట్స్. మూవీ హిట్ అయిపోయింది. నీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. మరోసారి కంగ్రాట్స్ అన్నా.. ఇలాంటి క్యారెక్టర్లలోనే నిన్ను చూడాలని అనుకున్నాం' అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు.

సినిమాలో అసలేందే మైనస్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' చిత్రాన్ని చూసిన మరో నెటిజన్ ఇందులోని ప్లస్‌, మైనస్‌లు చెప్పాడు. అతడి ట్విట్‌లో 'ఇందులో సినిమాటోగ్రఫి, బ్యాగ్రౌండ్ స్కోర్, 90ల నాటి బ్యాగ్‌డ్రాప్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. అలాగే, స్టోరీ, నేరేషన్, పాత సినిమాను చూసిన ఫీలింగ్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయి' అంటూ కథే దీనికి మైనస్ అని వెల్లడించాడు.

ఒకసారి ప్రయత్నించండి

సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాను చూసిన మరొక నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. 'మొత్తంగా ఈ సినిమా కథ తెలుగులో ఇప్పటికే వచ్చిన రివేంజ్ డ్రామాలను పోలినట్లే ఉంటుంది. కాబట్టి కొత్తదనం అనిపించదు. మీరు ఒకవేళ సందీప్ కిషన్ అభిమాని అయితే ఒకసారి ప్రయత్నించండి' అని రాసుకొచ్చాడు. ఇలా ఇప్పటి వరకూ మిక్స్‌డ్ టాక్‌ మాత్రమే దీనికి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X