మరో వ్యాపారం మొదలెట్టేశాడు.. సందీప్ కిషన్ మామూలోడు కాదు!
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంటుంది. ఫేమ్ ఉండి.. ఫాంలో దూసుకుపోతోండగానే.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.. ఆ డబ్బును ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టుకోవాలి. అలా ఎప్పుడైనా సినీ కెరీర్ ముగిసేందుకు వచ్చినా కూడా ఇలా వ్యాపార సంస్థలు ఆదుకుంటాయి. దాదాపు హీరో హీరోయిన్లందరూ కూడా వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు.

సందీప్ కిషన్ అలా..
హీరోగా సందీప్ కిషన్ మంచి విజయాలను దక్కించుకున్నాడు. కానీ రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఒక హిట్ వస్తే వెంటనే ఫ్లాపులు పలకరించడంతో కెరీర్ నెమ్మదిగానే సాగుతూ వచ్చింది. అలాంటి సమయంలోనే వ్యాపార రంగంలోకి దిగాడు సందీప్ కిషన్.
కన్నడ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ ప్రీ రిలీజ్ వేడుక.. తారలతో మెరిసిపోయిన ఈవెంట్

వివాహా భోజనం..
వివాహా భోజనం అంటూ సందీప్ కిషన్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించేశాడు. అలా సందీప్ కిషన్ బిజినెస్‌మెన్‌గా మారిపోయాడు. మొత్తానికి హీరోగానే కాకుండా వ్యాపారవేత్తగానూ సందీప్ కిషన్ తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సందీప్ కిషన్ ముందడుగు వేశాడు.

కొత్త వ్యాపారం..
సందీప్ కిషన్ ఏది ఆలోచించినా బాగానే ఆలోచించి ముందుకు వెళ్తున్నాడు. ప్రతీ ఒక్కరికీ అవసరమైన వాటి మీద పెట్టుబడులు పెడుతున్నాడు. రెస్టారెంట్ అంటే ప్రతీ ఒక్కరూ వెళ్తుంటారు. అలా తాజాగా తాను ప్రారంభించే వ్యాపారం కూడా అలాంటిదే.

సెలూన్ అంటూ..
ఎక్స్‌ప్రెస్ యూని సెక్స్ సెలూన్ అంటూ కొత్త షాపులను ప్రారంభించాడు. రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, కాకినాడ వంటి ప్రదేశాల్లో వీటిని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సందీప్ కిషన్ మాత్రం ఇలా బిజినెస్‌మెన్‌గా దూసుకుపోతోన్నాడు.

ఏ1 ఎక్స్‌ప్రెస్‌తో..
సందీప్ కిషన్ ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వదిలిన పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాడు. వచ్చే నెల ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. హాకి నేపథ్యంలో రాబోతోన్న ఈ చిత్రం మార్చి 5న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











