Ooru Peru Bhairavakona Trailer: గరుడ పురాణంలో మిస్సైన 4 పేజీలే ఈ సినిమా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
ఈ మధ్య కాలంలో అనేక అద్బుతమైన థ్రిల్లర్ సినిమాలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఒకప్పటి కంటే కూడా ఈ మధ్య మరిన్ని ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సినీ ప్రియులు వాటిపై ఆసక్తి చూపించడమే. అయితే గతంలో పొలిమేర, విరూపాక్ష, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా.. తాజాగా మరో అద్భుతైమైన థ్రిల్లర్ మూవీ మన ముందుకు రాబోతుంది. అదే సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్, వర్ష బొల్లమలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్, వైవా హర్ష, శుభోదయం సుబ్బారావు, ఖుషి రవిలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. వీ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.

హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష మాదిరిగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. సినిమా కూడా అలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో శాసనాల గ్రంథం తీసుకురావాలని అనగా... ఈ సినిమాలో మాత్రం గరుడ పురాణం గురించి అందులో మిస్సైన నాలుగు పేజీల గురించి ట్రైలర్ లో చూపించారు.
ముందుగా వర్ష బొల్లమ, సందీప్ కిషన్ ల మధ్య ప్రేమను వివరిస్తూ ఈ ట్రైలర్ ను చూపించారు. ఆ తర్వాత గరుడ పురాణంలో మిస్సైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన అని చెప్పగా.. భగవంతుని ఆధీనంలో లేనిదే ఈ కర్మ సిద్ధాంతం అంటూ మరో డైలాగ్ వినిపించారు. ఇక చివరలో వర్ష బొల్లమ్మ ఫైట్ కూడా చూపించారు. చేతికి అంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదురా చేసిన పాపాన్ని కడిగేసుకోవడం అంటూ చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇక సందీప్ కిషన్ చేసే సూపర్ పైటింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం అంచనాలు పెంచేలా ఉన్న ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి.
ఊరు పేరు భైరవ కోన సినిమాకు శేఖర్ చంద్ర అదిరోపోయే సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించగా.. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే అద్భుతమైన హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











