సందీప్ కిషన్ డిస్ట్రిబ్యూటర్ అవతారం
హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలో సరికొత్త కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రం ‘బీరువా' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే....ఈ చిత్రం ద్వారా సందీప్ కిషన్ డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తారు.
‘బీరువా' చిత్రానికి సంబంధించి గుంటూరు ఏరియా రైట్స్ తనే కొనుగోలు చేసాడు. సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టెనర్ అని, మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందని, అందుకే సినిమా గుంటూరు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసాను అని సందీప్ కిషన్ స్వయంగా వెల్లడించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
బయట టాక్ మాత్రం మరోలా ఉంది. సందీప్ కిషన్ గత సినిమాలు ‘రా రా కృష్ణయ్య', ‘జోరు' చిత్రాలు సరిగా ఆడక పోవడం వల్ల ‘బీరువా' బిజినెస్ అంతంత మాత్రంగానే సాగుతోందని, అందుకే గుంటూరు రైట్స్ తనే కొనుగోలు చేసాడని అంటున్నారు. ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన చిత్రం 'బీరువా'. 'సంజుగాడి ఫ్రెండ్..' అనేది ఉపశీర్షిక. సందీప్‌కిషన్, సురభి జంటగా నటించారు. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఒక బీరువా చుట్టూ సాగే కథ ఇది. సంజు అనే కుర్రాడికీ, వాళ్లింట్లో ఉన్న బీరువాకీ మధ్య ఏం జరిగిందో తెరపైనే చూడాలి. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది. సందీప్‌కిషన్, సురభి జంట తెరపై చూడముచ్చటగా కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ఇటీవల విడుదలైన పాటలు విజయవంతమయ్యాయి'' అన్నారు.
సందీప్ కిషన్, సప్తగిరి, షకలక శంకర్ ల మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు థియోటర్లలని నవ్వులతో ముంచెత్తుతాయని టాక్. క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నా...ఓవరాల్ గా వెంకటాద్రి ఎక్సప్రెస్ రేంజిలో హిట్ అయ్యే అవకాసముందని అంటున్నారు. ఫ్లాఫులతో ప్రయాణం చేస్తున్న సందీప్ కిషన్ కు ఈ చిత్రం ఊరట నిచ్చి నిలబెడుతుందని వినిపిస్తోంది.
నరేష్, ముఖేష్ రుషి, చలపతిరావు, అజయ్, సప్తగిరి, వేణు, షకలక శంకర్, గుండు సుదర్శన్, శివన్నారాయణ, అనితాచౌదరి, అనీషాసింగ్, సంధ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, కళ: సాహి సురేష్, నృత్యాలు: రాజుసుందరం, బాబాభాస్కర్, శేఖర్, పోరాటాలు: వెంకట్, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు


Click it and Unblock the Notifications











