రెండు ప్రాజెక్ట్‌లతో రంగంలోకి.. సందీప్ కిషన్ దూకుడు మామూలుగా లేదు!

సందీప్ కిషన్ జోరు ప్రస్తుతం మామూలుగా లేదు. ఒకే సారి రెండు ప్రాజెక్ట్‌లతో రంగంలోకి దిగాడు. ఓ వైపు కరోనా కారణంగా లేట్ అయిన A1 ఎక్స్ ప్రెస్ షూటింగ్‌ను నేడు మొదలుపెట్టాడు. అదే సమయంలో మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా రెండు పడవలపైనా సందీప్ కిషన్ ప్రయాణం చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి టాకీస్ పేరిట సందీప్ చిన్న సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమైన సందీప్ కిషన్‌కు.. నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ వంటి సినిమాలు కాస్త ఉపశమనిచ్చాయి. అయితే ఈసారి మాత్రం సందీప్ కిషన్ కాస్త రొటీన్‌కు భిన్నంగా రాబోతోన్నాడు. స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే A1 ఎక్స్‌ప్రెస్ నుంచి విడుదల చేసిన సాంగ్ సింగిల్ కింగులం అనే పాట ఓ రేంజ్‌లో క్లిక్కయింది. ఇక తాను నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కూడా వెరైటీగానే ప్లాన్ చేశాడు.

Sundeep Kishan Vivaha Bhojanambu Shooting Started

ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోన్నా అంటూ సందీప్ ట్వీట్ చేయడంతో అంతా పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది, ఓ ఇంటి వాడిని కాబోతోన్నా అని చెబుతాడేమో అని ఎదురుచూశారు. తీరా చూస్తే అది తన కొత్త ప్రాజెక్ట్ అప్డేట్. ఆనంది ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా వివాహ భోజనంబు అనే చిత్రాన్ని నిర్మించబోతోన్నట్టు ప్రకటించాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు సందీప్ కిషన్ సంబరాల్లో మునిగిపోయాడు.

Sundeep Kishan Vivaha Bhojanambu Shooting Started

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X