»   » బ్లాక్ బాస్టర్ సైన్స్ ఫిక్షన్ కథపై యువ హీరో కన్ను!

బ్లాక్ బాస్టర్ సైన్స్ ఫిక్షన్ కథపై యువ హీరో కన్ను!

Subscribe to Filmibeat Telugu

సందీప్ కిషన్ వరుస పరాజయాలతో నిరాశలో ఉన్నాడు. ఈ యువహీవుకు అర్జంటుగా ఓ హిట్టు కావలి. హిట్టు కోసం సందీప్ కిషన్ తనకు తోచిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు. సందీప్ కిషన్ కన్ను తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రపై పడినట్లు తెలుస్తోంది. ఇంద్రు నేతృ నాళై అనే తమిళ చిత్రం సైలెంట్ గా విడులై ఘనవిజయం సాధించింది.

సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యువ హీరో ఆ చిత్రం గురించి ఆరా తీస్తున్నాడట. ఇంద్రు నేతృ నాళై చిత్రం సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చి అలరించింది. ఎవరూ ఉహించని విధంగా ఈ చిత్రం ఘనవిజయం సాధించి ఆశ్చర పరిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో సందీప్ కిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ యువ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ కొరకు సందీప్ అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డెబ్యూ దర్శకుడు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించవచ్చని వార్తలు వస్తున్నాయి.

మనసుకు నచ్చింది రివ్యూ
Sundeep Kishan wants remake Tamil Blockbuster
English summary
Sundeep Kishan wants remake Tamil Blockbuster. Indru Netru Naalai Movie is huge hit in Tamil
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu