వామ్మో సందీప్ కిషన్ మాములోడు కాదు.. ఆ విషయంలో మంచి ప్లానే వేశాడు..

తెలుగు యువ హీరోల్లో ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరో సందీప్ కిషన్.. కొంత కాలం పాటు సరైన హిట్ లేక వెనకబడ్డాడు. అయితే జానర్ మార్చి సినిమాలు చేసినా.. లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్గా వచ్చిన నిను వీడని నీడను నేను అనే చిత్రం వరుస అపజయాల నుంచి కాస్త ఊరటనిచ్చింది.

అయితే సందీప్ కిషన్.. తాజాగా చేసిన ట్వీట్ వైలర్ అవుతోంది. ఈ హీరో నగరం అనే ఓ సినిమాను చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్.. తాజాగా ఓ జాక్ పాట్ కొట్టేశాడు. ఇళయ దళపతి విజయ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. తమిళ సంచలనం అయిన విజయ్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడైనా కోరుకుంటారు. ఇక తన స్నేహితుడైన లోకేష్ ఇంతటి లక్కీ చాన్స్ వచ్చినందుకు ఈ హీరో చాలా సంబరపడుతున్నాడు.

 Sundeep Kishan Wants To Meet Vijay Through His friend Lokesh Kanagaraj

అయితే దాంట్లోనూ ఈ హీరోకు చిన్న ఆశ కూడా దాగి ఉంది. అదేటంటే.. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లి విజయ్ ను చూద్దామని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. నాకెంతో గర్వంగా ఉంది మచ్చా.. నేనిక ఎదురుచూడలేకపోతున్నా.. నిన్ను చూడటానికి సెట్స్ కు వస్తా అలాగే విజయ్ సార్ ను కలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు.. స్క్రీన్ పై నువ్వు చేయబోయే మ్యాజిక్ గురించి ఎదురుచూస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం తెనాలి రామక్రిష్ణ బీఏ బీఎల్ చిత్రాన్ని చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X