A1 Express First Talk: సందీప్ ఖాతాలో మరొకటి.. ఆ టైంలో కూర్చోలేరు.. ఆ బాలీవుడ్ మూవీ గుర్తొస్తుంది!

చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన అతడికి.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తోనే మొదటి భారీ హిట్ దక్కింది. ఆ తర్వాత ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ.. సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫ్లాపులు పలకరించాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అతడు 'A1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ టాక్ మీకోసం!

స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న సందీప్ కిషన్

స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న సందీప్ కిషన్

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమా చేశాడు. స్టోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేస్తోంది. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. మార్చి 5న రిలీజ్ కానుంది.

 తొలిసారి తెలుగులో అలాంటి సినిమాతో

తొలిసారి తెలుగులో అలాంటి సినిమాతో

తెలుగు సినీ చరిత్రలోనే జాతీయ క్రీడ హాకీపై ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ప్రెస్'తో ఆ లోటును తీర్చుతున్నాడు. ఇందులో అతడు హాకీ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. ఆ ఆటలోని లోటుపాట్లను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. తమిళ చిత్రం 'నాప్టే తునై'కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

అంచనాలు భారీగా... హీరోల సహాయం

అంచనాలు భారీగా... హీరోల సహాయం

ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ జాతీయ క్రీడగా ఎంపికైన హాకీ.. ఇప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమానే 'A1 ఎక్స్‌ప్రెస్'. ట్రైలర్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక, ఈ మూవీ కోసం మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా కొందరు స్టార్లు ప్రమోషన్ కూడా చేస్తున్నారు.

‘A1 ఎక్స్‌ప్రెస్' మూవీ ప్రీ బిజినెస్ ఎంత?

‘A1 ఎక్స్‌ప్రెస్' మూవీ ప్రీ బిజినెస్ ఎంత?

టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ మార్కెట్ కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సందీప్ కిషన్ ఖాతాలో మరొకటి ఖాయం

సందీప్ కిషన్ ఖాతాలో మరొకటి ఖాయం


'A1 ఎక్స్‌ప్రెస్' ప్రపంచ వ్యాప్తంగా మార్చి 5న విడుదల కాబోతుంది. అయితే, ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇది చూసిన వాళ్లంతా సినిమా చాలా బాగుందని అంటున్నారు. చాలా కాలంగా హిట్ కోసం పరితపిస్తోన్న సందీప్‌ ఈ సారి విజయాన్ని అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. అలాగే, నటుడిగానూ పరిణితి చెందాడని పేర్కొన్నారు.

ఆ 20 నిమిషాలు హైలైట్.. కూర్చోలేరు

ఆ 20 నిమిషాలు హైలైట్.. కూర్చోలేరు


ఈ సినిమా అన్ని హంగులతో తెరకెక్కింది. అందుకు అనుగుణంగానే ఎప్పుడు ఏం కావాలో అదే చూపిస్తూ వచ్చారట. మరీ ముఖ్యంగా చివరి 20 నిమిషాలు హాకీ గేమ్ రసవత్తరంగా సాగుతుందట. ఆ సమయంలో ప్రేక్షకులు కుర్చీలో కూర్చోలేనంత ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సఫలం అయ్యాడని అంటున్నారు. అలాగే, తమీజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అని టాక్.

బాలీవుడ్ మూవీ గుర్తొస్తుందంటున్నారు

బాలీవుడ్ మూవీ గుర్తొస్తుందంటున్నారు


క్లైమాక్స్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతూ.. ప్రతి పౌరుడూ గర్వపడే సీన్స్ పెట్టారని తెలిసింది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమాలోని పతాక సన్నివేశాలు ఎలా ఉంటాయో.. 'A1 ఎక్స్‌ప్రెస్'లోనూ అదే తరహాలో చూపించేందుకు ప్రయత్నించాడట దర్శకుడు. మొత్తంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఇప్పటికే వీక్షించిన ప్రేక్షకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X