twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిషన్ "రారా కృష్ణయ్య'' విడుదల తేదీ

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలై 4 న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. జగపతిబాబు ఈ చిత్రంలో హీరో అన్నగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు.

    నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఉంటుంది. లక్ష్యం సినిమాలో గోపిచంద్ అన్నగా నటించిన జగపతిబాబు మళ్ళీ ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన కమిట్ అయిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలస్తుంది అన్నారు.

    Sundeep’s Ra Ra Krishnayya on July 4th

    సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

    దర్శకుడు మహేష్ మాట్లాడుతూ... ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. జగపతిబాబు, అల్లరి రవిబాబు, తనికెళ్ళ భరణి,బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ , నల్లవేణు, సత్యం రాజేష్, శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు.

    English summary
    
 Sundeep Kishan and Regina are acting as the lead actors in ‘Ra Ra Krishnayya’ and this movie is being readied for a possible release on July 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X