ప్రయాణం...ప్రేమ...పరుగులు ( 'రారా కృష్ణయ్య' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: 'వెంకటాద్రి ఎక్సప్రెస్' హిట్ తో జోష్ మీద ఉన్న సందీప్ కిషన్... మరోసారి జర్నీ కాన్సెప్టు తో ఈ రోజు మనముందుకు వస్తున్నారు. రొటీన్ లవ్ స్టోరీ చిత్రంలో తనతో జంట కట్టిన రెజీనాని తోడు తీసుకువస్తున్న ఈ చిత్రంపై సందీప్ కి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు సందీప్‌కి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. 'లెజెండ్' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆయనకు పేరు తెస్తుందని చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్,యాక్షన్ కలగలిసిన కథలో వస్తున్న ఈ చిత్రం దాదాపు ఏ పోటీ లేకుండా వస్తోంది. ఏ మాత్రం బాగున్నా...కలెక్షన్స్ కు లోటుండదు.

కొన్ని సంఘటనల వల్ల కొందరి జీవితాలే మారిపోతాయి. కృష్ణయ్య (సందీప్‌ కిషన్‌), నందు (రెజీనా) విషయంలో అదే జరిగింది. వీరిద్దరూ ఓ ప్రయాణంలో కలుసుకొంటారు. అక్కడి నుంచి జరిగే సంఘటనలు.. వీరిద్దరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తాయి. తమ లక్ష్యాల్ని సాధించడానికీ ఈ ప్రయాణమే కారణమవుతుంది. అదెలాగో, ఈ ఇద్దరికీ జగ్గూభాయ్‌ (జగపతిబాబు)కీ ఉన్న సంబంధం ఏమిటో తెరపై చూడాలి.

Sundeep’s Ra Ra Krishnayya preview

దర్శకుడు మాట్లాడుతూ...''స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. సందీప్‌-రెజీనాల కెమిస్ట్రీ, జగపతిబాబు నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కృష్ణయ్య పాత్రని 'రా.. రా' అంటూ కొన్ని పాత్రలు ఆహ్వానిస్తుంటాయి. అందుకే ఆ పేరు పెట్టాం. ఇందులో ఓ ముద్దు సన్నివేశం ఉంది. అది కావాలని ఇరికించలేదు. కథకు అదే కీలకం. ఆ ముద్దు కోసమే సెన్సార్‌వాళ్లు 'ఎ' ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అది మినహాయిస్తే.. కుటుంబం అంతా కలసి చూసేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు.

సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

చిత్రం: రా రా కృష్ణయ్య,
సంస్థ: ఎస్‌.వి.కె. సినిమా
నటీనటులు: సందీప్‌కిషన్‌, జగపతిబాబు, రెజీనా, కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు తదితరులు.
కెమెరా: శ్రీరామ్,
ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్,
ఆర్ట్: రామాంజనేయులు,
సంగీతం: అచ్చు,
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌. సిహెచ్‌
రచన, దర్శకత్వం: మహేష్‌బాబు పి.
విడుదల తేదీ: 04,జూలై 2014.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X