భానుతో కలిసి నట్టి బెదిరించాడు: సుందర్

నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్లు పెట్టి భానును, భానుతో లింకులు ఉన్న ఇతర నిర్మాతలు సి కళ్యాణ్ లాంటి వారిపై దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో..... భానుతో కలిసి బెదిరించాడంటూ ఫైట్ మాస్టర్ సుందర్ ఫిర్యాదు ఆసక్తితిని రేకెత్తిస్తోంది. నిన్న మొన్నటి వరకు తనకు భానుతో సంబంధాలు లేవన్నట్లుగా వ్యవహరిస్తున్న నట్టిపై తాజా ఫిర్యాదు నేపథ్యంలో పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
సుందర్ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు నట్టి కుమార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డొంకంతా లాంగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ ఫిర్యాదును బట్టి సినీ రంగంలో భాను దావూద్ మాదిరి తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో అర్థమవుతోందని, విచారణ మరింత లోతుగా జరిపితే మరింత మంది భాను మనుషులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు.
కాగా....నట్టి కుమార్ పై రజనీకాంత్ వీయంకుడు కస్తూరి రాజా కూడా కోర్టుకెక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. 'త్రీ' సినిమా తెలుగు హక్కులు తీసుకున్న నట్టి దాదాపు 1.8 కోట్ల వరకు చెల్లని చెక్కులు ఇచ్చి చేశాడని తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











