సునీల్ 'భీమవరం బుల్లోడు' డిజిటల్ పోస్టర్

By Srikanya

హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ 'భీమవరం బుల్లోడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. '1000 అబద్ధాలు' చిత్రం ఫేమ్ ఎస్తేర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ని రీసెంట్ గా విడుదల చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజిటల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ తో కలగలిపిన కామెడీ చిత్రం అని అర్దమవుతోంది.

Bheemavarapu Bullodu

అలాగే డిజిటల్ మోషన్ పోస్టర్ లింక్ ...

<center><center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="MTc1NDAwfHwyfHwxfHwxLDEsMQ==";var ven_width="100%";var ven_height="417";</script><script type="text/javascript" src="http://web.ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center></center>

చిత్రనిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ 'మా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇది 50వ సంవత్సరం. ఈ నేపథ్యంలో వస్తున్న 'భీమవరం బుల్లోడు' చిత్రం మా బేనర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. భీమవరం వాసి అయిన సునీల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటంతో చిత్రానికి ఆయన ఊరి పేరే పెట్టాం. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం' అని తెలిపారు.

దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ 'కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ 'కలిసుందాం..రా', 'బలాదూర' తరువాత సురేశ్ సంస్థలో నేను పనిచేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో పని చేయడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.

తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X