నా సీన్లు కట్ చేశారు, జీడి పప్పులా వాడారు: ‘అరవింద సమేత’పై సునీల్
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నటులు సునీల్, నవీన్ చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమెడియన్ సునీల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ముందే పంచ్ డైలాగులు వేస్తూ అందరినీ నవ్వించాడు.

నన్ను జీడి పప్పులా వాడారు
సునీల్ మాట్లాడుతూ... నేను కూడా ఆడియన్స్‌తో పాటు సినిమా చూశాను. నన్ను చేను ఇలా చూసుకుని చాలా రోజులైంది. కొంత మంది నీ కామెడీ తక్కువైందని చెప్పారు. వారికి ఒకటే చెప్పాను. ఇది బిర్యానీ భయ్యా... అందుకే నన్ను జీడి పప్పులా వేశారని చెప్పాను అని సునీల్ తెలిపారు.

అలా అయితే దరిద్రంగా ఉంటుంది
ఒక వేళ ఈ సినిమా ఫ్రూట్ సలాడ్ అయుంటే నన్ను అరటి పండులా వాడేవారు. బిర్యానీలో అరటి పండులా వాడితే చాలా దరిద్రంగా ఉంటుందని కదా అంటూ సునీల్ చమత్కరించారు.

నా ఫ్రెండ్ త్రివిక్రమ్ నా సీన్లు కట్ చేశాడు
నా మీద అభిమానంతో, ఫ్రెండ్షిప్‌తో నా సీన్లు మూడు త్రివిక్రమ్ కట్ చేశాడు కానీ మిగతా అన్ని సీన్లు ఉంచాడు. నాకు చాలా తృప్తిగా ఉంది. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని సునీల్ అన్నారు.

ఫ్యాక్షన్ సినిమాలో క్లాసిక్ ఇది
మామూలుగా ఫ్యాక్షన్ సినిమా అంటే జనం అందరికీ యాక్షన్ సినిమా. కానీ ఆ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాడు. ఫ్యాక్షన్ సినిమాల్లో ఒక మంచి క్లాసిక్ మూవీ ఇది. ఈ సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యాదములు... అని సునీల్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











