సునీల్ సిక్స్ ప్యాక్ వెనక సీక్రెట్
నా సిక్స్ ప్యాక్ బాడీ వెనక ఓ రహస్యం ఉంది అంటున్నారు సునీల్. ఆయన పూలరంగడు చిత్రంలో సిక్స్ పాక్ తో కనిపించనున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ... ఇంతకాలం నేను నవ్విస్తే.. జనం నవ్వేశారు. ఇప్పుడు పది మందిని నేను సీరియస్‌గా చితగ్గొట్టేస్తున్నా నవ్వేశారనుకోండీ. పరువుపోతుంది. అందుకే ఈ కసరత్తులు. 'పూలరంగడు' సినిమాలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నాయి. వాటిని ఆషామాషీగా చేయకూడదనే సిక్స్‌ప్యాక్ చూపించాను. అంతేగానీ...ఇప్పుడున్న హీరోలకు పోటీ ఇద్దామని కాదు అన్నారు. అలాగే...నిజానికి పూలరంగడు కంటే ముందే 'నెపోలియన్' అనే సినిమాలో నటించాల్సింది.
ఆ సినిమా పేరుకు తగ్గట్టే యాక్షన్ చిత్రం. ఆ సినిమా కోసం ఆరు పలకల్లో కనిపించాలని ముందే అనుకొన్నా. దానికి సంబంధించిన వ్యాయామాలు కూడా మొదలుపెట్టా. అయితే ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అందుకే ఎలాగూ మొదలెట్టాను కదాని కొనసాగించాను. 'పూలరంగడు' సినిమాకి నా వ్యాయామం ఉపయోగపడింది. మనమేదో ఆరు, ఎనిమిది పలకల దేహంతో కనిపిస్తే జనం అబ్బో అనుకొంటారుగానీ.. హాలీవుడ్ సినిమాల్లో హాస్యనటులకూ సిక్స్‌ప్యాక్‌లుంటాయి అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











