twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్-సునీల్ కలిసి ఇప్పటికీ రెంటు కడుతున్నారట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. సునీల్ కూడా టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కొత్తలో కష్టాలు పడ్డవారే. పైగా ఇద్దరూ కలిసి జర్నీ చేసారు. పంజాగుట్ట సాయిబాబు గుడి సమీపంలో ఒకే గదిలో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఆసక్తికర విషయం ఏమిటంటే...త్రివిక్రమ్, సునీల్ మ్యారేజ్ కూడా ఒకే తేదీన జరిగింది.

    తాజాగా ‘కృష్ణష్టమి' సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న సునీల్ తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ గదితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని చెప్పిన సునీల్.... దానికి ఇంకా రెంటు కడుతున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్ నేను, ఇద్దరం డొక్కు స్కూటర్‌పై వెళ్లేవాళ్లం. అప్పట్లో కష్టమనిపించేది. కాని ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నా ఆ తృప్తి దొరకడం లేదు అన్నారు.

    అప్పట్లో ఎన్నో కష్టాలు పడ్డామని, బస్సు టికెట్టుకుడా డబ్బుల్లేక చాలా దూరం కాలినడకనే తిరిగేవాడని. చాలా అవమానాలు ఎదుర్కోని ఇలా ప్రేక్షకులకు దగ్గరయ్యాను అని తెలిపారు. నా బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టు పాత్రలు సృష్టించి, నాకంటూ ఓ డైలాగ్‌ డెలివరీతో గుర్తింపునిచ్చాడు. ‘వంద చేపలు ఇవ్వడం కంటే ఓ చేప పట్టడం నేర్పు' అనేది నాకు త్రివిక్రమే నేర్పించాడు‌ అన్నారు.

    Sunil And Trivikram room details

    "కృష్ణాష్టమి" చిత్రం ఫిబ్రవరి 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్". అన్నారు.

    సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఈ చిత్రం లో ఉన్నారు. దర్శకత్వం - స్క్రీన్ప్లే -వాసు వర్మ, నిర్మాత - రాజు, సహ నిర్మాతలు - శిరీష్, లక్ష్మణ్, ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు, ఎడిటర్ - గౌతం రాజు, సంగీతం - దినేష్, కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం, ఫైట్ మాస్టర్ - అనల్ అరసు, ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్, నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

    English summary
    Sunil And Trivikram are famous today but like many other successful people, they faced struggles during the initial days in the industry. The duo waited years to get a chance. During their struggling period, they used to live in a small room near Sai Baba temple in Punjagutta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X