బాలకృష్ణకు పోటీ ఇవ్వటానకి సునీల్ ప్రిపరేషన్
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా 'కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-అప్పలరాజు' అనే చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మించే ఈ చిత్రం సంక్రాంతికి రిలీజవుతుంది. అలాగే ఈ సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా దాసరి దర్శకత్వంలో రూపొందుతోన్న పరమ వీర చక్ర చిత్రం రిలీజ్ కానుందని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. మర్యాద రామన్నతో హీరోగా హిట్ కొట్టిన సునీల్, సింహాతో చాలా కాలం తర్వాత విజయం సాధించిన బాలయ్య పోటీలో ఉంటారు.
ఇక 'కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-అప్పలరాజు' ఈ నెల(ఆగస్టు) 27న చిత్రం ప్రారంభమవుతుంది. హాస్యం ప్రధానంగా సాగే ఈ చిత్రం సినీ పరిశ్రమపై సెటైర్ గా తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ "పన్నెండేళ్ల తరవాత వర్మ నేరుగా తెలుగులో దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ న్నారు. ఇక హీరో సునీల్ మాట్లాడుతూ...వర్మ దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక పరమవీర చక్ర చిత్రం సెకెండ్ షెడ్యూల్ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ నుంచి కంటిన్యూగా గ్యాప్ లేకుండా డిసెంబర్ వరకూ జరుగుతుంది.


Click it and Unblock the Notifications











