twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అరవింద సమేత’ టీజర్లో సునీల్‌ను గమనించారా? మళ్లీ పాత కమెడియన్‌గా...

    By Bojja Kumar
    |

    Recommended Video

    Pic Of The Day : Sunil Appears In Aravinda Sametha Teaser

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత' మూవీ టీజర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్‌కు ఎవరూ ఊహించంత భారీ రెస్పాన్స్ వస్తోంది. ఉదయం 9 గంటలకు టీజర్ విడుదల చేయటగా అప్పుడే 4 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. టీజర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు, యాక్షన్ పెర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. టీజర్లో అందరి దృష్టి ఎన్టీఆర్ మీదే ఉంది కానీ... అందులో చాలా మంది గమనించని విషయం ఒకటి ఉంది. ఇందులో కమెడియన్ సునీల్ కూడా ఉన్నాడు.

     కీలకమైన పాత్రలో సునీల్

    కీలకమైన పాత్రలో సునీల్

    ఒకప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేక పోవడంతో మళ్లీ ఒకప్పటి సునీల్‌లా ప్రేక్షకులను నవ్వించాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా ద్వారా సునీల్ కమెడియన్‌‌‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

    స్నేహితుడి సినిమా ద్వారా

    స్నేహితుడి సినిమా ద్వారా

    తన స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో `అర‌వింద స‌మేత‌` ద్వారా క‌మెడియ‌న్‌గా రీ-ఎంట్రీ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడట. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ు. ఈ సినిమాలో న‌టించినందుకు దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

     ఇకపై వరుసగా

    ఇకపై వరుసగా

    ‘అరవింద సమేత'తో పాటు ర‌వితేజ న‌టిస్తున్న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమాలో కూడా సునీల్ నవ్వులు పండించబోతున్నాడు. రెండు సినిమాల్లో సునీల్ పాత్ర ద్వారా బాగా నవ్వులు పేలితే అతడి కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయం.

    అరవింద సమేత

    ‘అరవింద్ సమేత' చిత్రానని హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

    English summary
    Sunil Appearance in Aravinda Sametha teaser. Comedian turned Hero Sunil is back to shooting as a comedian in NTR's 'Aravindha Sametha'. Sunil reportedly has been paid in 1 crore for This movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X