తనికెళ్ల భరణి దర్శకత్వంలో భక్త కన్నప్పగా సునీల్!

By Bojja Kumar

హైదరాబాద్: కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో ఓ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారట.

ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

సునీల్‌కు టాలెంట్ ఉంది....కానీ ఆయన లాంటి కామెడీ హీరోతో తనికెళ్ల భరణి 'భక్త కన్నప్ప' లాంటి కథతో ప్రయోగం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి భరణి సునీల్ నుంచి మేరకు తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? ఇతర వివరాలు అఫీషియల్‌గా వెల్లడికావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X