»   » ఎట్టకేలకు సునీల్ నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతోంది

ఎట్టకేలకు సునీల్ నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమెడియన్ గా ఉన్నప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సునీల్ హీరోగా మారిన తర్వాత కామెడీ పాత్రలకు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో ఆయన సినిమాలు చాలా స్లో అయ్యాయి. హీరోగా మంచి పొజిషన్ కు చేరుకోవాలనే ప్రయత్నంలో సునీల్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.

సునీల్ చివరి సినిమా ‘భీమవరం బుల్లోడు' వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటింది. ఈ సినిమా తర్వాత సునీల్ పలు సినిమాలు కమిటైనప్పటికీ ఏ సినిమా కూడా మొదలు కాలేదు. ఎట్టకేలకు ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్, వంశీ కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శకత్వంలోఓ చిత్రం ప్రారంభమైంది.

Sunil as Bhatudu

ఈ నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ‘భటుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌లో ఆర్‌.సుద‌ర్శన్ రెడ్డి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం‌లో సునీల్ స‌ర‌స‌న ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సిస్టర్ మ‌న్నార్ చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో సునీల్‌, మ‌న్నార్ చోప్రా, క‌భీర్ సింగ్‌), సప్తగిరి , నాగినీడు, తాగుబోతు ర‌మేష్‌, ప్రదీప్ రావ‌త్‌, పృద్వి, రాజార‌వీంద్ర‌, సుప్రీత్ రెడ్డి, ష‌ఫి, అదుర్స్ ర‌ఘు, ప్రగ‌తి, శ్రావ్య‌, ప‌విత్రా నాయ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

English summary
As per the latest update, this Sunil movie will start its regular shoot from 18 August in Hyderabad. This film is tentatively titled as Bhatudu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu