Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్‌గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాపం సునీల్.. మళ్లీ కమెడియన్‌గా.. ఆదుకొన్న క్లోజ్‌ఫ్రెండ్!
Recommended Video
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం సినిమా రంగంలో చాలా సర్వసాధారణం. ఈ సామెత కమెడియన్ కమ్ హీరో సునీల్‌కు సరిగ్గా సరిపోతుంది. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం హీరో పాత్రను వదిలేసి కమెడియన్‌గా ప్రయత్నిస్తున్నాడట. పాపం హీరోగా సినిమాలు ఫ్లాప్ కావడంతో కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రేక్షకులతో లింక్ తెగిపోకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
కమెడియన్‌గా వరుస హిట్లు
నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, మనసంత నువ్వే చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో స్టార్ కమెడియన్‌గా మారాడు. కమెడియన్‌గా మంచి పొజిషన్లో ఉండగానే తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు హీరోగా మారాడు. అందాల రాముడు, మర్యాద రామన్న , పూలరంగడు చిత్రాలతోపాటు వరుసగా మంచి హిట్ల సాధించాడు.
హీరోగా ఫ్లాప్ సినిమాలు
ఆ తర్వాత సునీల్ నటించిన జక్కన్న, మిస్టర్ పెళ్లికొడుకు, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు లాంటి సినిమాలు వరుసగా పరాజయం పొందాయి. దాంతో సునీల్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీయడానికి వచ్చిన నిర్మాతలు జారుకొన్నారట. దాంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
త్రివిక్రమ్ సహాయం..
తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ సాయం తీసుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం మళ్లీ సునీల్ కమెడియన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడనేది ఫిలింనగర్ సమాచారం.
సునీల్‌కు త్రివిక్రమ్ అండ
తనకు ప్రాణస్నేహితుడైన త్రివిక్రమ్ మళ్లీ సునీల్ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో రూపొందించబోయే సినిమాలో మరోసారి కమెడియన్‌గా దర్శనం ఇవ్వనున్నాడు.
ఎన్టీఆర్ సినిమాలో ప్రధాన పాత్ర
హారిక, హాసిని క్రియేషన్ బ్యానర్లో రూపొందే చిత్రంలో ఎన్టీఆర్‌తోపాటు సునీల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. సునీల్ కోసం ఓ మంచి పాత్రను తీర్చిదిద్దారట. పాత్రకు తగినట్టు పంచ్‌లను సిద్ధం చేస్తున్నారనేది ఇన్సైడ్ టాక్.
మళ్లీ కమెడియన్‌గానే..
ఎన్టీఆర్ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా కొనసాగుతాడా లేదా హీరోగా కూడా నటిస్తాడా అనేది క్లారిటీ లేదు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషనలో రానున్న చిత్రం ముహుర్తం షాట్ కార్యక్రమం పవన్ చేతుల మీద జరిగిన సంగతి తెలిసిందే.