twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం సునీల్.. మళ్లీ కమెడియన్‌గా.. ఆదుకొన్న క్లోజ్‌ఫ్రెండ్!

    By Rajababu
    |

    Recommended Video

    పాపం..మళ్లీ కమెడియన్‌గా నా ?

    ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం సినిమా రంగంలో చాలా సర్వసాధారణం. ఈ సామెత కమెడియన్ కమ్ హీరో సునీల్‌కు సరిగ్గా సరిపోతుంది. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం హీరో పాత్రను వదిలేసి కమెడియన్‌గా ప్రయత్నిస్తున్నాడట. పాపం హీరోగా సినిమాలు ఫ్లాప్ కావడంతో కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రేక్షకులతో లింక్‌ తెగిపోకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

     కమెడియన్‌గా వరుస హిట్లు

    కమెడియన్‌గా వరుస హిట్లు

    నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, మనసంత నువ్వే చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో స్టార్ కమెడియన్‌గా మారాడు. కమెడియన్‌గా మంచి పొజిషన్‌లో ఉండగానే తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు హీరోగా మారాడు. అందాల రాముడు, మర్యాద రామన్న , పూలరంగడు చిత్రాలతోపాటు వరుసగా మంచి హిట్ల సాధించాడు.

     హీరోగా ఫ్లాప్ సినిమాలు

    హీరోగా ఫ్లాప్ సినిమాలు

    ఆ తర్వాత సునీల్ నటించిన జక్కన్న, మిస్టర్ పెళ్లికొడుకు, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు లాంటి సినిమాలు వరుసగా పరాజయం పొందాయి. దాంతో సునీల్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీయడానికి వచ్చిన నిర్మాతలు జారుకొన్నారట. దాంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

     త్రివిక్రమ్ సహాయం..

    త్రివిక్రమ్ సహాయం..

    తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌ సాయం తీసుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం మళ్లీ సునీల్ కమెడియన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడనేది ఫిలింనగర్ సమాచారం.

    సునీల్‌కు త్రివిక్రమ్ అండ

    సునీల్‌కు త్రివిక్రమ్ అండ

    తనకు ప్రాణస్నేహితుడైన త్రివిక్రమ్ మళ్లీ సునీల్ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో రూపొందించబోయే సినిమాలో మరోసారి కమెడియన్‌గా దర్శనం ఇవ్వనున్నాడు.

     ఎన్టీఆర్ సినిమాలో ప్రధాన పాత్ర

    ఎన్టీఆర్ సినిమాలో ప్రధాన పాత్ర

    హారిక, హాసిని క్రియేషన్ బ్యానర్‌లో రూపొందే చిత్రంలో ఎన్టీఆర్‌తోపాటు సునీల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. సునీల్ కోసం ఓ మంచి పాత్రను తీర్చిదిద్దారట. పాత్రకు తగినట్టు పంచ్‌లను సిద్ధం చేస్తున్నారనేది ఇన్‌సైడ్ టాక్.

     మళ్లీ కమెడియన్‌గానే..

    మళ్లీ కమెడియన్‌గానే..

    ఎన్టీఆర్ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా కొనసాగుతాడా లేదా హీరోగా కూడా నటిస్తాడా అనేది క్లారిటీ లేదు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషనలో రానున్న చిత్రం ముహుర్తం షాట్‌ కార్యక్రమం పవన్ చేతుల మీద జరిగిన సంగతి తెలిసిందే.

    English summary
    Tollywood top comedian turned performer Sunil is making his rebound as comedian into the film industry. Be that as it may, everybody ponder about which motion picture would be his movie for come back as a comedian. Reports suggest that He is going to act as comedian in Trivikram, Jr NTR film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X