సునీల్ హీరోగా సురేందర్ రెడ్డి చిత్రం
అబ్బో కమెడియన్ సునిల్ కు డిమాండ్ చాలానే ఉంది. ఆయన హీరోగా చేసిన అందాల రాముడు హిట్ కావడమే కారణం కావచ్చు. అందాల రాముడు తరువాత సునిల్ హీరోగా బంతి సినిమా కూడా రూపొందనున్నది. ఇదేం పెద్ద విషయం కాదు కానీ అతిథి లాంటి భారీ విజయం సాధించిన చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి, సునిల్ హీరోగా సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తెలుగులో ఒకే సినిమా తీసి బాలీవుడ్ వెళతానన్న సురేందర్ రెడ్డి ఆ ఒక్క సినిమా అవకాశాన్ని సునీల్ కు దక్కేలా చేయడం సునీల్ సత్తా ఏమిటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్, అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు తీయాలని ఉందని సురేందర్ రెడ్డి అంటున్నాడు.


Click it and Unblock the Notifications











