twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: సినిమాగా 'అమృతం' టీవి సీరియల్

    By Srikanya
    |

    గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్ సినిమాగా రానుంది. సునీల్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజే తెరకెక్కించనున్నారని సమాచారం. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహించనున్నారని సమాచారం.

    జస్ట్ యల్లో బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే సీరియల్ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తారా లేక, కథ కూడా తీసుకుని చేస్తారా అనేది మాత్రం తెలియటం లేదు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు పూర్తైందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి. పూర్తి స్ధాయి కామెడీగా ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

    మొదట ఈ సినిమాకు అల్లరి నరేష్ ని అనుకున్నారు కానీ నరేష్ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో విరమించుకున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ లో సునీల్ ఓ చిత్రం చేస్తున్నారు. సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్సకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.పతాకంపై రూపొందతున్న చిత్రానికి సంబరాల రాంబాబు అనే టైటిల్ ని పెట్టారు. డి.సురేష్‌బాబు నిర్మాత. డి.రామానాయుడు సమర్పకులు. సంబరాల రాంబాబు టైటిల్ తో గతంలో చలం హీరోగా వచ్చిన చిత్రం సూపర్ హిట్ అయింది.

    ఈ చిత్రం గురించి సునీల్‌ మాట్లాడుతూ ''ఈ సంస్థ నిర్మించిన చాలా సినిమాల్లో నేను నటించాను. స్క్రిప్ట్‌ వినగానే నాకు 'అహనా పెళ్ళంట' సినిమానే గుర్తుకొచ్చింది. తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదం పండించేందుకు ఆస్కారమున్న కథాంశమిది. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. వినోదంతోపాటు, యాక్షన్‌, నృత్యాలు... ఇలా అన్ని అంశాలు ఇందులో ఉంటాయ''అన్నారు.

    ఇక ఈ చిత్రం పూర్తి కామెడీతో సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు తను వెడ్స్ మను రీమేక్ లో సునీల్ చేస్తున్నారు. అలాగే నాగచైతన్య తో కలిసి తమిళ చిత్రం వెట్టై రీమేక్ సైతం కమిటయ్యారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తున్న చిత్రం కథ: కవి కాళిదాస్‌, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఆర్ట్‌: వివేక్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: మణిశర్మ

    English summary
    Suresh Productions wants to make another film with Sunil titled as Amrutham. Gunnam Gangaraju will be the director. Suresh Productions is currently producing a film with Sunil in the direction of Uday Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X