సునీల్ కొత్త చిత్రం ‘సీతా వెడ్స్ రాముడు’?
బాలీవుడ్‌లో మాధవన్, కంగనారనౌత్ జంటగా నటించిన 'తను వెడ్స్ మను' చిత్రం ఆధారంగా సునీల్ హీరోగా తెలుగులో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దేవి ప్రసాద్ దర్శకుడు. ఇషా చావ్లా కథానాయిక. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'సీతా వెడ్స్ రాముడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం.
కమెడియన్ గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత అందాల రాముడు చిత్రం ద్వారా హీరోగా టర్న్ అయి మర్యాద రామన్న చిత్రం ద్వారా హీరోగా నిలదొక్కుకున్నాడు. తాజాగా విడుదలైన పూలరంగడు మంచి విజయం సాధించడం సునీల్ కు మరింత ఊపునిచ్చింది. పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.
కమెడియన్ గా రూ. 15 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునే సునీల్ ప్రస్తుతం పూలరంగడు హిట్ తో రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నాడట. ఏది ఏమైనా....హీరో కావాలనే పట్టుదలతో చాలా వర్కౌట్లు చేసి, కష్ట పడి, బాడీని మెల్ట్ చేసుకుని పర్ ఫెక్టుగా తయారైన సునీల్ కమిట్మెంట్ కి హాట్సాఫ్ అంటున్నారంతా....


Click it and Unblock the Notifications











