వాడిని నేనే అలా మార్చా, మళ్లీ హీరోను చేసే ఉద్దేశ్యం లేదు: త్రివిక్రమ్
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ కమెడియన్లలో ఒకరిగా తన హవా కొనసాగించిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు. అయితే హీరోగా ఒకటి రెండు హిట్స్ మినహా మిగతావన్నీ నిరాశ పరచడంతో మళ్లీ రివర్స్ గేవర్ వేశారు. ప్రస్తుతం సునీల్ 'అరవింద సమేత' ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా సునీల్ మాట్లాడుతూ ఇది నాకు కమెడియన్‌గా పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నీలాంబరి పాత్రలో సునీల్
ఈ చిత్రంలో సునీల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తాడు. అతడి పాత్ర ఎంటరైనప్పటి నుండి ఎండింగ్ వరకు ఉంటుంది అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. సునీల్ మీద వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయన్నారు.
Recommended Video


సునీల్‌ను కేవలం కమెడియన్‌గా చూడలేం
సునీల్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.... అతడిని కేవలం కమెడియన్‌గా చూడలేం, ఆయన ఒక ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అన్నారు. అతడి పెర్ఫార్మెన్స్‌లో ఒక విభిన్నమైన శైలి ఉంటుందని ప్రశంసించారు.

నేనే అలా మార్చానన్న త్రివిక్రమ్
సునీల్ కేవలం కమెడియన్ పాత్రలు మాత్రమే కాదు... విలన్ పాత్రలు చేయగలడు. వాస్తవానికి సునీల్ ఇండస్ట్రీకి విలన్ పాత్రలు చేయాలనే వచ్చాడు. నేనే అతడిని కమెడియన్‌గా మార్చాను అని త్రివిక్రమ్ వెల్లడించారు.

మళ్లీ హీరోను చేసే ఉద్దేశ్యం లేదు
సునీల్‌ను మీ దర్శకత్వంలో మళ్లీ హీరోను చేసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు త్రివిక్రమ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అలాంటి ఉద్దేశ్యం లేదు. ఈ ప్రయాణం వాడికీ సుఖంగా ఉంది, నాకూ సుఖంగా ఉంది అని త్రివిక్రమ్ తేల్చి చెప్పారు.

త్రివిక్రమ్ గురించి సునీల్ గొప్పగా
ఇటీవల అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సునీల్ మాట్లాడుతూ... ‘‘మన జీవితంలో అమ్మా నాన్న మనల్ని ఓపికగా పెంచి ఇది మంచి చెడు అని చెబుతారు. తర్వాత గురువులు కొంత విజ్ఞానం నేర్పుతారు. తర్వాత అన్నయ్యలు, మనకంటే పెద్దోళ్లు డబ్బులు ఇచ్చి మనల్ని బాగా చూస్తారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ మూడు పోర్షన్లు తీసుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు డబ్బులు ఇచ్చి, విజ్ఞానం ఇచ్చి నాకు రూట్ చూపించాడు. జీవితంలో మంచి ఫ్రెండును సెలక్ట్ చేసుకుంటే చాలు లైఫ్ ధైర్యంగా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ త్రివిక్రమ్.'' తన స్నేహితుడి గురించి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











