సునీల్ చిత్రానికి 'రాధా కృష్ణుడు'ఖరారు
సునీల్,దేవిప్రసాద్ కాంబినేషన్ లో రెండు రోజుల క్రితం ఓ చిత్రం ప్రారంబమైన సంగతి తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆ చిత్రానికి రాధా కృష్ణుడు అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు సమాచారం. మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో పూల రంగడు హీరోయిన్ ఇషా ఛావ్లా నటిస్తోంది. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ "సునీల్ హీరోగా మా బేనర్‌లో ఇది రెండో సినిమా. అతన్ని హీరోని చేస్తూ మేం నిర్మించిన తొలి చిత్రం 'అందాలరాముడు' ఎంత హిట్టయిందో తెలిసిందే. 'తను వెడ్స్ మను' చిత్రంలోని హీరో పాత్రను సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు మార్పులు చేసి, చక్కని వినోదాత్మక స్క్రిప్టు సిద్ధం చేశాడు దేవీప్రసాద్. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం'' అని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ "ఒరిజినల్‌లో హీరో పాత్ర కూల్‌గా ఉంటుంది. దానికి కామెడీ జోడించాడు దేవి. ఈ బేనర్‌లో నేను చేసిన 'అందాలరాముడు' కంటే ఈ సినిమా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు. రాఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, మధు, ఖలీల్, తులసి, ఉషశ్రీ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: నందమూరి హరి, కళ: ఎం.ఎస్. కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్.


Click it and Unblock the Notifications











