twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సంబరాల రాంబాబు'గా సునీల్ ఖరారు

    By Srikanya
    |

    అందాల రాముడు, పూల రంగడు, మర్యాద రామన్న అంటూ వరసగా సునీల్ కి పాత సినిమా టైటిల్స్ కలిసి వస్తున్నాయని ఫిక్స్ అయినట్లున్నారు. అందుకేనేమో. తాజాగా సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.పతాకంపై రూపొందతున్న చిత్రానికి సంబరాల రాంబాబు అనే టైటిల్ ని పెట్టారు. డి.సురేష్‌బాబు నిర్మాత. డి.రామానాయుడు సమర్పకులు. సంబరాల రాంబాబు టైటిల్ తో గతంలో చలం హీరోగా వచ్చిన చిత్రం సూపర్ హిట్ అయింది.

    ఈ చిత్రం గురించి సునీల్‌ మాట్లాడుతూ ''ఈ సంస్థ నిర్మించిన చాలా సినిమాల్లో నేను నటించాను. స్క్రిప్ట్‌ వినగానే నాకు 'అహనా పెళ్ళంట' సినిమానే గుర్తుకొచ్చింది. తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదం పండించేందుకు ఆస్కారమున్న కథాంశమిది. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. వినోదంతోపాటు, యాక్షన్‌, నృత్యాలు... ఇలా అన్ని అంశాలు ఇందులో ఉంటాయ''అన్నారు.

    సురేష్‌ బాబు మాట్లాడుతూ ''పూలరంగడు' చిత్రం కోసం సునీల్‌ పడిన కష్టం నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. ప్రతి సన్నివేశంలోనూ తనదైన ప్రతిభ చూపించాడు''అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..'ఈ సంస్థలో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. కథ చెప్పిన వెంటనే చాలా బాగుందని ఒప్పుకొన్నారు సునీల్‌. ఉత్సాహంగా సాగిపోయే చక్కటి కథాంశమిది'' అన్నారు‌.

    ఇక ఈ చిత్రం పూర్తి కామెడీతో సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు తను వెడ్స్ మను రీమేక్ లో సునీల్ చేస్తున్నారు. అలాగే నాగచైతన్య తో కలిసి తమిళ చిత్రం వెట్టై రీమేక్ సైతం కమిటయ్యారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తున్న చిత్రం కథ: కవి కాళిదాస్‌, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఆర్ట్‌: వివేక్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: మణిశర్మ

    English summary
    Suresh Productions has registered this title. Is this title for Sunil's movie? Suresh Productions is currently producing a film with Sunil in the direction of Uday Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X