»   » ఉంగరాల రాంబాబు కొత్త సినిమా.. హీరో ఎవరో తెలుసా?

ఉంగరాల రాంబాబు కొత్త సినిమా.. హీరో ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మరో కొత్త చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఉంగరాల రాంబాబు చిత్రంలో నటించడానికి సునీల్ ఓకే చెప్పారు. ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్. పరచూరి కిరిటీ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే దర్శక, నిర్మాతలు ప్రకటించనున్నారు. సునీల్ క్రేజ్ తగినట్టుగా ఉన్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని రేపుతున్నది.

Sunil as Ungarala Rambabu, New film with kranti Madhav
Sunil as Ungarala Rambabu, New film with kranti Madhav

ఇటీవల కాలంలో సరైన విజయాలు లేక సునీల్ కాస్త వెనుకబడిపోయారు. అన్నిరకాల టాలెంట్ ఉన్నా విజయాలను సొంతం చేసుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తున్నది. కథల ఎంపిక, టైమింగ్ అంశాలే ప్రధాన కారణనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్‌కు మంచి హిట్‌ను, దర్శక, నిర్మాతలకు మంచి సక్సెస్‌ను ఇవ్వాలని కోరుకొందాం.

English summary
Sunil new film under kranti Madhav direction is titled as Ungarala Rambabu.Parachuri keeriti producing it
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu