స్టార్ హీరో రేంజిలో... సునీల్ చేతిలో వరుస ప్రాజెక్టులు!
హైదరాబాద్: కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్..... తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సునీల్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సునీల్ చేతిలో ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 5 ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇటీవలే 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సునీల్ ప్రస్తుతం 'భీమవరం బుల్లోడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకుడు. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్రిస్తున్నారు. ఈచిత్రంలో సునీల్ గోవింద స్టైల్ లో డాన్స్ చేయనున్నాడు.
మరో వైపు సునీల్-నాగచైతన్య కలిసి నటించిన చిత్రం(వెట్టై రీమేక్) త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. ఈచిత్రంలో సునీల్, నాగచైతన్య అన్నదమ్ములుగా నటించారు. ఈ చిత్రంలో సునీల్ ఆండ్రియాతో జంటగా నటించాడు. వేసవిలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవే కాకుండా సునీల్ చేతిలో మరిన్నిప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి)తో కలిసి త్వరలో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. మరో వైపు ప్రముఖ రచయిత గోపీమోహన్ సునీల్ హీరోగా ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గోపీమోహన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దీంతో పాటు మరో సినిమా కూడా త్వరలో ఓకే కానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











