ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ టైప్ కాదంటున్న సునీల్
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో త్వరలో విడుదల కానున్న మర్యాదరామన్న చిత్రం ట్రైలర్స్ విడుదల చేసారు. వాటిలో ఒక ట్రైలర్ లో ఎన్టీఆర్ ..స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, రవితేజ..విక్రమార్కుడు, నితిన్..సై, ప్రభాస్..ఛత్రపతి, రామ్ చరణ్..మగధీర చిత్రాల్లోని ఎమోషనల్ గా (ఆయుధం పట్టుకుని దూకే) సన్నివేశాలను కట్ చేసి ఈ మర్యాదరామన్న చిత్రం ట్రైలర్ కి జత చేసారు. ముందుగా వారందరనీ ఆయా ఎమోషన్స్ తో చూపెట్టి...చివరలో సునీల్ అమాయికంగా ఫేస్ పెట్టి అయ్య బాబోయ్...నేనా టైప్ కాదండి అని ప్యాజ్ ఇచ్చి నిజం అండీ అంటాడు. ఈ ట్రైలర్ వెంటనే ఆకట్టుకుంటోందని చెప్తున్నారు. ఇక నిన్న రాత్రి( జూలై 4) విడుదలైన ఈ చిత్రం ఆడియో కూడా మంచి సక్సెస్ ను సాధించినట్లే నని వినపడుతోంది. బెస్ట్ ఆఫ్ లక్ సునీల్, రాజమౌళి. ఇక ఆ ట్రైలర్ యూ ట్యూబ్ లో http://www.youtube.com/watch?v=2ZMrBVUAK70 లో చూడవచ్చు.


Click it and Unblock the Notifications