సునీల్, హీరోయిన్... ఫామ్‌హౌజ్‌లో భం చికు భం!
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన యాక్టర్ సునీల్...ప్రస్తుతం 'పూలరంగడు" సినిమాతో బీజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో సునీల్ సరసన ఇషా చావ్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సునీల్ ఈ హీరోయిన్‌తో ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని ఫాం హౌస్ లో గడుపుతున్నాడు. భం చికు భం చేస్తున్నాడు.
ఆగండాగండీ...ఫాం హౌజ్, భం చికు భం అనగానే కొంపతీసి అదేదో అనుకునేరు? అదేం లేదండీ. పూల రంగడు సినిమాకు గాను హీరోయిన్ ఇషా చావ్లాతో కలిసి సునీల్ ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడంతే. మర్యాద రామన్న సినిమాలో సునీల్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చిన నేపథ్యంలో 'పూల రంగడు" సినిమాలో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది సునీల్ తపన.
సునీల్ జోరు చూస్తుంటే అల్లు అర్జున్‌ను మించి పోయేలా ఉన్నాడని, సునీల్‌కు అంతటి సత్తా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి అప్పల్రాజుతో డీలా పడ్డ సునీల్ మళ్లీ ఓ ఊపు ఊపాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం...


Click it and Unblock the Notifications











