»   » రీమేక్ కమిటైన సునీల్..డిటేల్స్

రీమేక్ కమిటైన సునీల్..డిటేల్స్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్ :ఒక భాషలో హిట్టైన చిత్రం మరో భాషలో రీమేక్ కావడం కొత్తేమీ కాదు. రీమేక్‌ల పేరుతో ప్రతీ భాషలోనూ బోలెడన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. కాకపోతే ఇటీవల వరసగా రీమేక్స్ తెలుగులో వస్తున్నాయి. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

    తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ప్రస్తుతం సునీల్‌ 'దసరాబుల్లోడు' చిత్రంలో నటిస్తున్నారు.

    గతంలో తమిళ పదం రీమేక్ ..సుడిగాడు హిట్ ఇచ్చిన భీమినేని మరోసారి ఈ రీమేక్ తో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నారు. రీసెంట్ గా సునీల్ తో చేసిన తమిళ చిత్రం వెట్టై రీమేక్ గా వచ్చిన తడాఖా చిత్రం మాత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఆ చిత్రంలో సునీల్ పిరికివాడైన పోలీస్ గా కనిపించారు. ఈ చిత్రాలతో పాటు లేడీ డైరక్టర్ బి.జయ దర్శకత్వంలో ఆయన హీరోగా చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం.

    ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో ఓ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    Sunil will be the hero of director Bhimaneni Srinivas Rao's next film. This director hit the bulls eye with the superhit film Sudigadu. Sunil has been finalized as the hero of his next film. Now after a year he is back with a script which is inspired by a Tamil film Suderapandian (2012). The film will go on floors shortly. Rest of the cast is yet to be finalized. 
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more