twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ గెస్ట్ రోల్ లో...

    By Srikanya
    |

    హైదరాబాద్ : సునీల్ త్వరలో ఓ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించి అలరించనున్నారు. ఆ చిత్రం మరేదో కాదు అల్లరి నరేష్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ 3D. అలాగే పోసాని కృష్ణ మురళి కూడా ఈ చిత్రంలో మరో గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

    అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మే 31 నుంచి జూన్ 7వ తేదీకి వాయిదా పడింది.

    జూన్ 24న విడుదల కావాల్సిన 'ఇద్దరమ్మాయిలతో' మే 31కి వాయిదా పడటంతో....ఆ రోజు విడుదల కావాల్సిన 'యాక్షన్ 3డి' చిత్రం జూన్ 7కి వాయిదా పడింది. థియేటర్ల కేటాయింపు సమస్య కారణంగా ఇలా జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన

    ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లరి నరేష్ సినిమా అంటే....కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, టైమింగ్ తో కూడిన పంచ్ డైలాగులు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. రాను రాను అల్లరి నరేష్ సినిమాలు పంథా మారుతున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తోడవుతున్నాయి.

    రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

    English summary
    Naresh’s Action 3D has actor Sunil in a cameo role. The film is overflowing with stars. It has Naresh, Vaibhav, Raju Sundaram, Kick Shaam as heroes and Kamna Jethmalani, Sneha Ullal, Ritu Barmecha, Neelam Upadhyaya as heroines. Apart from Sunil, Posani Krishna Murali has done a guest appearance in this film. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X