పవన్ కళ్యాణ్ తో సునీల్ పోటీ

By Srikanya

సునీల్ హీరోగా ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో ఓ చిత్రం రూపొందనుందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఈ నెల 18న ప్రారంభం కానుంది. అహనా పెళ్లంట"దర్శకుడు వీరభద్రచౌదరి రూపొందించే ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.అదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం కూడా పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.మరో ఎన్టీఆర్ ,బోయపాటి శ్రీను ల చి్త్రం,మహేష్ పూరీ ల ది బిజినెస్ మ్యాన్ లు కూడా సంక్రాంతికే ప్లాన్ చే్స్తున్నారు.ఇక మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి సునీల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇషా చావ్లా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత అచ్చిరెడ్డి చెబుతూ-''ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మరో మంచి సినిమా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది.ఈ సినిమాకు చక్కని కథ కుదిరింది. బాధలన్నింటినీ మరచిపోయి... కడుపుబ్బ నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇంకా ఈ కథలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సునీల్‌ని హీరోగా మరో మెట్టుకు తీసుకెళుతుందీ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం"" అన్నారు.ఇక సునీల్ అప్పలరాజు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X