అదంతా...సునీల్ కి ఎస్.ఎస్.రాజమౌళి ఎఫెక్టు?
సునీల్ హీరోగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రొడక్షన్ లో ఉండగానే సునీల్ కు వరసగా హీరో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా రామ్ ప్రసాద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ ప్రసాద్ ...చిరునవ్వుతో, కళ్యాణరాముడు, నా స్టైలే వేరు, గేమ్ వంటి చిత్రాలు రూపొందించారు. ఇక ఈ చిత్రం పూర్తి స్ధాయి కామిడీతో ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కాక రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో కూడా సునీల్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరో ఇద్దురు దర్శకులు కూడా సునీల్ తో చేయటానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అందాల రాముడు లో హీరోగా చేసినా ఎవరు దృష్టి సునీల్ మీద పడలేదు. ఒకటి రెండు చిత్రాలు హీరోగా వచ్చినా ఇప్పుడే క్రేజ్ మొదలైంది. ఇదంతా రాజమౌళి చిత్రంలో చేయటం వల్ల వచ్చిన ఎఫెక్టు అంటున్నారు.మర్యాద రామన్న సినిమా హిట్టై స్టార్ గా అవుతాడని అప్పుడు డేట్స్ కోసం తిరిగేకన్నా ఇప్పుడు నుంచే మేలుకుంటే మేలని భావిస్తున్నారు. ఇక ఫ్యాక్షన్ నేపధ్యంలో కామిడీగా సాగే మర్యాద రామన్న లో సలోని హీరోయిన్ గా చేస్తోంది. మగధీర చిత్రం తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











