సురేష్ ప్రొడక్షన్స్ లో సునీల్ చిత్రం...పూర్తి డీటేల్స్
కమిడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ తానేంటో పూల రంగడుతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అతని డేట్స్ కోసం ఇండస్ట్రీ అంతా చుట్టూ తిరుగుతోంది. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ వారు అతనితో సినిమా చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఉదయ్ శంకర్ దర్సకత్వంలో రూపొందే ఆ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. గతంలో కలిసుందాం రా, రారాజు వంటి చిత్రాలు చేసిన ఉదయ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే వెంకటేష్ తో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే పూర్తి కామెడీకి వెంకటేష్ ఓకే చేయకపోవటంతో అప్పుడు ఆగింది. ఇప్పుడు సునీల్ తో పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రనికి సంభందించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి అఫీషియల్ ప్రకటన వస్తుంది. ఇక మరో ప్రక్క సునీల్...తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. దేవి ప్రసాద్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. దానితో పాటు లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం సైతం కమిటయ్యినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications