అరవింద సమేత, చిత్రలహరి తర్వాత మరో క్రేజీ చిత్రం.. కొరటాల, మెగాస్టార్ సినిమాలో!
Recommended Video
ప్రముఖ నటుడు సునీల్ గురించి అందరికి తెలిసిందే. కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే చాలా మందికి అభిమాన నటుడిగా మారిపోయాడు. సునీల్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కమెడియన్ గా కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో సునీల్ హీరోగా మారాడు. ఆరంభంలో మంచి విజయాలు దక్కినా ఆ తర్వాత సునీల్ నటించిన చిత్రాలన్నీ తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు మళ్ళీ సునీల్ కామెడీ రోల్స్ తో బిజీగా అవుతున్నాడు. తాజాగా సునీల్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

అరవింద సమేత
హీరోగా వరుస పరాజయాలు ఎదురుకావడంతో సునీల్ మళ్ళీ హాస్యం పండించాలని డిసైడ్ అయ్యాడు. అరవింద సమేత చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అరవింద సమేతలో సునీల్ సినిమా మొత్తం కొనసాగే పాత్రలో నటించాడు. ఇకపై అన్నిరకాల పాత్రల్లో నటిస్తానని సునీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరో విజయం
ఇటీవల సునీల్ నటించిన చిత్రలహరి చిత్రం కూడా విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో సునీల్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. వరుస విజయాలతో సునీల్ కు మళ్ళీ అవకాశాలు జోరందుకుంటున్నాయి. సునీల్ కామెడీకి ఎలాంటి క్రేజ్ ఉందో దీనిని బట్టే అర్థం అవుతుంది. స్టార్ డైరెక్టర్స్ సైతం సునీల్ కోసం తమ చిత్రాల్లో ఓ పాత్రని సిద్ధం చేసుకుంటున్నారు.

మెగాస్టార్ సినిమాలో
తాజాగా సునీల్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రని సునీల్ పోషించబోతున్నాడట. చాలా రోజుల తర్వాత చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సునీల్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్ కి చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో కొన్ని కారణాల వలన సునీల్ ఆ చిత్రం చేయలేదు.

త్వరలో ప్రారంభం
ఇక కొరటాల శివ, చిరంజీవి చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రం తర్వాత కొరటాల చాలా రోజులుగా చిరంజీవి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. చిరంజీవి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక చిరంజీవి, కొరటాల చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్ని ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.


Click it and Unblock the Notifications











