సీన్ మారింది..సునీల్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో సునీల్ తన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో చేయబోతున్నారని ట్వీట్ చేసారు. అయితే రవితేజ ఈ చిత్రంలో చేస్తున్నారా లేదా అన్నది మాత్రం క్లారిఫై చేయలేదు. పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న గబ్బర్ సింగ్ అనంతరం ఈ చిత్రం ఉంటుందని అంటున్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం ..గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు చిత్రం చేయటానికి కమిటయ్యాడు. అలాగే రీసెంట్ గా రవితేజ యాక్షన్ చిత్రం వీర విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సునీల్ మాత్రం ప్రస్తుతం ఏ సినిమా చేయటం లేదు.తనూ వెడ్స్ మనూ రీమేక్, నెపోలియన్ చిత్రాలు కమిటయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











