సునీల్ ఫ్యాషన్ డిజైనర్ కాదు...అంతా ఉత్తిత్తే...!?
ప్రముఖ దర్శకుడు వంశీ తన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'లేడీస్ టైలర్" ని రీమేక్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అప్పటి రాజేంద్ర ప్రసాద్ పాత్రను అల్లరి నరేష్ లేదా సునీల్ చేస్తారని పుకార్లు షికారు చేశాయి. ఈ ఊహాగానాల నేపధ్యంలో డైరెక్టర్ వంశీ క్లారిటీ ఇచ్చారు. 'లేడీస్ టైలర్" సీక్వేన్స్ వర్క్ జరుగుతుంది. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ ఎవరు చేస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి నరేష్, సునీల్ ల కాల్ షీట్స్ కూడా నాదగ్గర లేవని వంశీ చెప్పారు.
అయితే, లేడీస్ టైలర్ సీక్వేన్స్ గా 'ఫ్యాషన్ డిజైనర్, సన్నాఫ్ లేడీస్ టైలర్" పేరుతో చిత్రం చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో పని ప్రారంభం అవుతుందని చెప్పారు. ఒక ప్రధాన నటుడు ఈ చిత్రం చేస్తారని వంశీ వెల్లడించారు. రాబోయే నెలల్లో ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రముఖ దర్శకుని ప్రాజెక్ట్ లో ఎవరు చేస్తారన్నది వేచిచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











