'నువ్వునాకు నచ్చావు' సినిమాలో సునీల్ చేసిన బంతి పాత్రను మర్చిపోయేవారుండరు.ఇప్పుడు అదే టైటిల్ ని రాజమౌళి తన తదుపరి సినిమాకు ఎంచుకున్నాడు. జనవరి 2009 లో ప్రారంభమయ్యే ఈ సినిమాకి హీరోయిన్ కాజల్ అని వార్తలు వినిపిస్తున్నా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామిడీగా తీర్చి దిద్దాలని రాజమౌళి స్ర్కిప్టు ని దగ్గరుండి వండిస్తున్నాడని వినికిడి. ఇప్పటికే త్రివిక్రమ్ ఒక వెర్షన్ అనఫీషయల్ గా రాశాడని చెప్తున్నారు. అలాగే ఇంతకు ముందు ఈ ప్రాజెక్టును సురేంద్ర రెడ్డి చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే కమెడియన్ తో సినిమా తీసి హిట్టిస్తే కామెడీ దర్శకుడుగా ముద్ర వేస్తారనే భయంతో అతను తప్పుకున్నాడని రాజమౌళి కి అలాంటి భయాలు లేవని ఫిలింనగర్ టాక్.