త్వరలో సునీల్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోనున్నాడు...?
ఏ హీరోలో అయినా మార్పులు వచ్చాయంటే అతడు ఖచ్చింతంగా సక్సెస్ అవుతున్నట్టే..అందుకు నిదర్శనం రవితేజ, అల్లరి నరేష్ ఇద్దరూ సైడ్ యాక్టర్, లేదా కమేడియన్ నుండి బిజీ హీరోల స్టేజ్ కి ఎదిగిపోయారు. ప్రస్తుతం వారిలిస్ట్ లోకి సునీల్ చేరుతున్నాడు.. ఇలాగే కొనసాగితే కమెడియన్ గా ఉన్న మినిమం గ్యారెంటీ యాక్టర్" గా పేరు సంపాదించుకుంటాడు.
కొందరు స్టార్ హీరోల కంటే సునీలే బెటరని మన అగ్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకే స్టార్ హీరోల డేట్స్ కోసం వెంపర్లాడకుండా సునీల్ ని హీరోగా పెట్టి సినిమాలు తీయడం మంచిదని భావిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ సునీల్ తో సినిమాలు నిర్మించడానికి నడుం కట్టారంటే ఏమనుకోవాలి మరి? సురేష్ బాబు, దిల్ రాజు, ఆర్ బి చౌదరి త్వరలో సునీల్ తో తలా ఒక సినిమా నిర్మించబోతున్నారు.
సునీల్ తో సినిమా తీస్తే అయిదారు కోట్లలో చుట్టేయవచ్చు. సినిమా బాగుంటే పదిహేను కోట్ల వరకు వచ్చేస్తుంది. లేదంటే పెట్టుబడికి ఢోకా ఉండదు. ఇంత లాభసాటి హీరో ఇంకెవరూ లేకపోవడంతో సునీల్ కి రెండు కోట్లు ఇచ్చి అయయినా హీరోగానే పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ కారణంగానే సునీల్ కి కమెడియన్ గానూ అవకాశాలు తగ్గపోయాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











