సునీల్ నెక్ట్స్ లేడీ డైరక్టర్ తో ఖరారు

By Srikanya

హైదరాబాద్: 'తడాఖా' సక్సెస్ తో జోరు మీద ఉన్న సునీల్ వరస చిత్రాలు కమిటవుతున్నారు. లేడీ డైరక్టర్ బి.జయ దర్శకత్వంలో ఆయన హీరోగా చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం.

అలాగే సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బిందాస్,రగడ చిత్రాల దర్శకుడు వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ' ఫ్రెండ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం సునీల్...భీమవరం బుల్లోడు టైటిల్ తో చిత్రం చేస్తున్నాడు. కలిసుందాం రా ఫేమ్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే సునీల్ రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలోనూ మరో చిత్రం కమిటయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X