మర్యాద రామన్న చూడండి మళ్ళీ రేపు కలుస్తానండి...!
తెలుగు హీరోలు చాలా మంది ఈ మధ్య ట్విట్టర్లో చేరిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ద్వారా వాళ్ళ సినిమాల ప్రమోషన్ కి కూడా వాడుకుంటున్న విషయం తెలిసిందే. అసలు ట్విట్టర్స్ ఓపెన్ చేసిందే సినిమా ప్రమోషన్స్ కోసం అట. ఇప్పుడు ఈ ట్విట్టర్లో కొత్తగా హీరో సునీల్ చేరాడు. కామెడియన్ గా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకాదరణ పొందిన సునీల్ అందాల రాముడు" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఫస్ట్ సక్సెస్ చవిచూశారు. ఇప్పుడు మరల తన రెండోవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న" రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ వేసిన స్టెప్స్ సూపర్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమాని ప్రమోట్ చేయటం కోసమే సునీల్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసారని అతని ఫస్ట్ పోస్టింగ్ తోనే అర్థమవుతుంది. 'మర్యాదరామన్న"ను చూడండి, మళ్లీ రేపు కలుస్తానండీ అంటూ పోస్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











