twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బులు కోసం బూతు సినిమా తీసానంటున్నారు

    By Srikanya
    |

    డబ్బులు కోసం ఓ బూతు సినిమా రూపొందించానని కొందరన్నారు. నిజానికి డబ్బులు కోసమే అయితే ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కేవలం సినిమా పట్ల ప్రేమతో ఈ రంగంలోకి వచ్చాను''అన్నారు దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి. ఆయన రూపొందించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ'చిత్రం 25 రోజుల వేడుకలో ఆయన ఇలా స్పందించారు. అలాగే అవార్డులు తెచ్చిన 'సొంతవూరు', 'గంగపుత్రులు' చిత్రాల్ని ఎంత కమిట్‌మెంట్‌తో తీశానో, అంతే కమిట్‌మెంట్‌తో ఈ 'రొమాంటిక్ క్రైమ్‌కథ'ను తీశానని చెప్పారు.

    ఇప్పటివరకు మేం తీసిన ఎనిమిది సినిమాలకు 18 నంది అవార్డులు వచ్చాయి. తొలిసారి మా తొమ్మిదో సినిమాకి డబ్బులొచ్చాయి. ఇదివరకు తీసిన సినిమాలకు డబ్బులు రాకపోయేసరికి విసుగెత్తి ఈ సినిమా తీశానని కొంతమంది అంటున్నారు. ఊరు చచ్చిపోతున్నదని ఓ సినిమానీ, నీరు చచ్చిపోతున్నదని ఇంకో సినిమానీ తీసిన నేను, ఇప్పుడు మన ఉనికే చచ్చిపోతున్నదని ఈ సినిమా తీశా. పిల్లలకూ, పెద్దలకూ మధ్య ముసుగులు ఉంటున్నాయనీ, ఆ ముసుగులు తొలగించాలనీ ఈ సినిమాలో చెప్పాను. డబ్బుల కోసం ఈ సినిమా తియ్యలేదు. సమాజం కోసమే తీశానని చెప్పారు.

    అదే ఫంక్షన్ కి హాజరైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడు మాట్లాడుతూ... పేరుకి చిన్న సినిమా అయినా కలెక్షన్లు బాగున్నాయనీ, ఇలాంటి పిక్చర్లు మరిన్ని రావాలనీ అన్నారు. అలాగే ...సీనియర్ డైరెక్టర్ పి. చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమాని స్కూలు టీచర్లందరూ చూడాలి. పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో తెలుసుకోవాలి'' అని సూచించారు.

    చిన్న సినిమాలకు డబ్బులేం వస్తాయన్న ప్రశ్నకు సమాధానం ఈ చిత్రమేనని నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ చెప్పారు. ఈ చిత్రంలో ఎక్కడా బూతు లేదనీ, చాలా మంచి చిత్రమనీ, దీనికి కూడా అవార్డులు ఇవ్వాలనీ దర్శకుల సంఘాధ్యక్షుడు వి. సాగర్ అభిప్రాయపడ్డారు. వారానికి పది థియేటర్ల చొప్పున పెరుగుతున్న చిన్న సినిమా ఎక్కడా లేదనీ, ఆ ఘనతను 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' సాధించిందనీ శ్రీ కీర్తి క్రియేషన్స్ అధినేత ఎం.ఎల్. కుమార్‌చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో పి.సి.రెడ్డి, సాగర్‌, టి.ప్రసన్నకుమార్‌, ఎమ్‌.ఎల్‌.కుమార్‌చౌదరి, బసిరెడ్డి, మనోజ్‌ నందం, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Sunil Kumar Reddy's Oka Romantic Crime Katha film completed 25 days. Directer Sunil Kumar rddy Says that his film is not a adult film and it's a messeage orianted film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X