For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గల్ఫ్‌లో పనిమనుషుల మాఫియా.. మోసం అలా జరుగుతున్నది.. సునీల్ కుమార్‌రెడ్డి

  By Rajababu
  |

  గల్ఫ్‌లో అనేక అవస్థలకు గురవుతున్న భారతీయవ వలస కార్మికుల కథను అనేక పరిశోధనలు చేసి తెరకెక్కించాం. రెండు దేశాల మధ్య నలుగుతున్న సీరియస్ అంశం గల్ఫ్ కార్మికుల సమస్య. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ను కమర్షియల్ తెరక్కించాం. గల్ఫ్‌లో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర జీవితం, లైంగిక దాడులు, ఆకలి కేకలను గల్ఫ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు, సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. గల్ఫ్‌లో కొనసాగుతున్న దారుణాల గురించి సునీల్ కుమార్ రెడ్డి వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే..

  గల్ఫ్ సమస్య ఎంత తీవ్రమైనదో

  గల్ఫ్ సమస్య ఎంత తీవ్రమైనదో

  ప్రస్తుతం గల్ఫ్‌లో తీవ్రతరమవుతున్న సమస్యలను మా చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాం. సినిమా చూసిన తర్వాత గల్ఫ్ సమస్య ఎంత తీవ్రమైనదో తప్పక తెలుస్తుంది. గల్ఫ్ దేశాలలో చాలా నిబంధనలు కఠినంగా ఉంటాయి. గసగసాలు తీసుకెళ్లినా గానీ 20 ఏళ్లు జైలులో పెడుతారు. కడప, ఇతర జిల్లాలకు చెందిన చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారు.

   ప్రేమ కథ నేపథ్యంగా గల్ప్ సమస్య

  ప్రేమ కథ నేపథ్యంగా గల్ప్ సమస్య

  ప్రేమ కథ నేపథ్యంగా ఓ సామాజిక సమస్యను తెరకెక్కించాం. తెలంగాణ సిరిసిల్లాకు చెందిన ఓ యువకుడు, గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మధ్య నడిచిన ఓ కథ ఉంటుంది. హీరో హీరోయిన్లుగా చేతన్ మద్దినేని, డింపుల్ నటిస్తున్నారు. కన్స్‌ట్రక్షన్ లేబర్‌గా చేతన్, ఇంటి పనులు చేయడానికి వెళ్లిన యువతిగా డింపుల్ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అనిల్, సంతోష్ పవన్, పోసాని, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు.

   గల్ఫ్‌ సమస్య తీవ్రమైనది

  గల్ఫ్‌ సమస్య తీవ్రమైనది

  గల్ఫ్‌లో ఇతర దేశాలలో భారతీయులకు ఎదురవుతున్న సమస్యలపై గల్ఫ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు పలు రాయబార కార్యాలయాల్లో అధికారులు సానుకూలంగా స్పందించారు. అరబ్ షేక్‌ల ఇంట్లో పనిచేయడానికి మహిళా కార్మికులను పంపించకుండా చర్యలు తీసుకోండి అధికారులు కోరడాన్ని బట్టి చూస్తే ఈ సమస్య ఎంత తీవ్రమైనదో ఊహించుకోవచ్చు. ఓ ఘటనలో షేక్ ఇంట్లో పనిచేస్తున్న ఓ భారతీయ మహిళ చేయి నరకడం అనే విషయం చాలా సంచలనం రేపింది.

   అత్యధిక భాగం గల్ఫ్‌లోనే

  అత్యధిక భాగం గల్ఫ్‌లోనే

  గల్ఫ్ సినిమా కథ అత్యధిక భాగం గల్ఫ్‌లోనే జరుగుతుంది. గల్ఫ్‌లో ఆయా బాధితులు చెప్పిన వాస్తవ అంశాలను కథగా అల్లుకొని ఈ సినిమాను రూపొందించాం. స్టోరి క్రెడిట్ ను ఆయా బాధితులకు ఇస్తున్నాం. ఈ సినిమాలో ఓ డిఫెరెంట్ ప్రేమకథ ఉంటుంది. సరిహద్దులు దాటిన ప్రేమ కథ ఇది.

  పనిమనుషుల మాఫియా

  పనిమనుషుల మాఫియా

  అరబిక్ దేశాలలో పనిమనుషుల మాఫియా ఉంటుంది. అక్కడ స్థానికులు కేవలం 4 శాతం మాత్రమే. మిగితా 96 శాతం మంది వలస వచ్చిన కార్మికులే. అరేబియా దేశాల్లో మనవాళ్లే మనవాళ్లను మోసం చేస్తున్నారు. మన దేశం నుంచి ఎక్కువగా ఒంటరి వలసలు జరుగుతుంటాయి. దాంతో అక్కడ సహజీవనం, ఇతర అక్రమ సంబంధాలు ఏర్పడటానికి చాలా అవకాశాలు ఏర్పడ్డాయి. గల్ఫ్‌లో బయటకు కనిపించే ప్రపంచం వేరు.. అక్కడ అంతర్గతంగా జరిగే సంఘటనలు వేరు. అవి సాధారణంగా బయటకు రావు. అలాంటి అంశాలను తెలుసుకొని కథలో భాగం చేశాం.

  పులగం చిన్నారాయణ మాటలు చాలా ప్లస్

  పులగం చిన్నారాయణ మాటలు చాలా ప్లస్

  ఈ సినిమాకు సినీ రచయిత పులగం చిన్నారాయణ అందించిన మాటలు చాలా ప్లస్ అయ్యాయి. మేము చేసిన 400 పరిశోధన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకొని పులగం చిన్నారాయణ మాటలు రాశారు. సినిమా చూసిన తర్వాత ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏ మేరకు ఉంటుందో మీకో అర్థమవుతుంది.

  తొలిసారి అరబిక్ పాట

  తొలిసారి అరబిక్ పాట

  ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే.. తెలుగు చిత్రంలో తొలిసారి పూర్తిస్థాయిలో అరబిక్ పాట పెట్టాం. దానిని గల్ఫ్‌లోనే చిత్రీకరించాం. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు ధన్యవాదాలు. ఆయన వాయిస్ మా సినిమాకు అదనపు ఆకర్షణ.

  English summary
  'GULF' movie is produced on Sravya Films Banner and the producers are Y. Ravindra Babu and M.S. Ramkumar. Nandi award winning Director P. Sunil Kumar Reddy who directed hit movies Oka Romantic Crime Katha directing the Gulf movie. Movie starring Chetan Maddineni, who acted previously in Dil Raju, Maruthi Production movie Rojulu Marayi, Dimple, Santhosh, Anil, Surya, Posani, Tanikella Bharani etc., This movie is slated to release on October 13th. In this occasion, Sunil Kumar Reddy speaks to Filmibeat, Oneindia Telugu Exclusively...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X