Ramayanam: ఆ లక్షణాలు ఆమెకు లేవు... సాయి పల్లవిపై బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్
సౌత్ మొత్తం సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని పిలుచుకుంటుంది. ఆమె అందం, అభినయం, డ్యాన్స్ అన్నీ చూశాకే ఈ బిరుదును ఇచ్చి, కోట్లాదిమంది సౌత్ మూవీ లవర్స్ ఆమెకు అభిమానులుగా మారారు. గ్లామర్ షో చేయకుండానే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇంతటి ఇమేజ్ ఉన్న సాయి పల్లవిపై బుల్లితెర లక్ష్మణుడిగా పాపులర్ అయిన సునీల్ లాహ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.
'దంగల్' ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా 'రామాయణం' అనే మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే రీసెంట్ గా సెట్ నుండి కొన్ని చిత్రాలు లీక్ అవ్వగా, అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్‌లో, సాయి పల్లవి తల్లి సీత పాత్రలో కనిపించింది. అభిమానులకు వీరిద్దరి లుక్ తెగ నచ్చింది. కానీ సునీల్ లాహ్రి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రామానంద్ సాగర్ టీవీ సిరీస్ 'రామాయణం'లో లక్ష్మణుడి పాత్రను పోషించి ఫేమస్ అయిన సునీల్ లాహ్రి రణబీర్ కపూర్ లుక్‌పై మాట్లాడుతూ 'రణబీర్ లుక్ నాకు బాగా నచ్చింది. అతను తెలివైనవాడు కాబట్టి అతను ఈ పాత్రలో పరిపూర్ణంగా కనిపిస్తాడు. అయితే రీసెంట్ గా ఆయన చేసిన యానిమల్ మూవీని చూశాక రణబీర్ ను రాముడిగా అంగీకరించడం కష్టం. రణబీర్ ను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు. ఇమేజ్ లేదా బ్యాగేజీ లేని నటుడిని రాముడిగా నటింపజేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అన్నారు.
ఇక్కడిదాకా ఆయన అభిప్రాయం బాగానే ఉంది. కానీ సాయి పల్లవి విషయంలో సునీల్ చేసిన కామెంట్స్ ఆమె అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. సునీల్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ 'నటిగా ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆమె చేసిన పనిని లేదా సినిమాలను నేను ఎప్పుడూ చూడలేదు. కానీ లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు.
నా మనసులో సీత ముఖం చాలా అందంగా, పరిపూర్ణంగా ఉంటుంది. సాయి ముఖంలో అది ఉందని నేను అనుకోను. భారతీయుల ఆలోచనలలో, దేవతలందరూ ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నారు, వారు అసాధారణంగా ఉండాలి. రావణుడు ఆమెతో ప్రేమలో పడేంత ఆకర్షణీయంగా ఈ నటిని ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సునీల్ అభిపాయంపై సాయి పల్లవి అభిమానులు మండి పడుతున్నారు. ఒకసారి ఆమె సినిమాలు చూడండి అని సజెస్ట్ చేస్తున్నారు.
ఒకసారి ఇలాంటి కామెంట్స్ చేసే ముందు సాయి పల్లవి సినిమాలు చూసి ఉంటే ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ లో ఆమె ఒకరనే విషయం అర్థమయ్యేది. కానీ అసలు ఆమె గురించి అవగాహనే లేకుండా సునీల్ ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని జాత్యహంకారం, అజ్ఞానం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.


Click it and Unblock the Notifications











