సునీల్ నెక్ట్స్ ఆ చిత్రమే...
హైదరాబాద్: రీసెంట్ గా 'భీమవరం బుల్లోడు' గా కనిపించిన సునీల్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. ఏప్రియల్ చివరి వారం నంచి కంటిన్యూ షెడ్యూల్ తో సినిమా ప్రారంభం కానుంది. ఆ చిత్రం మరేదో కాదు 'భక్త కన్నప్ప'. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు సునీల్ తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాలని కసరత్తులు చేస్తున్నట్లు వినికిడి.
ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం డిసెంబర్ 2015 లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ లోగా సునీల్ వి రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మకం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌కు టాలెంట్ ఉంది....కానీ ఆయన లాంటి కామెడీ హీరోతో తనికెళ్ల భరణి 'భక్త కన్నప్ప' లాంటి కథతో ప్రయోగం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి భరణి సునీల్ నుంచి మేరకు తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? ఇతర వివరాలు అఫీషియల్‌గా వెల్లడికావాల్సి ఉంది.
ఇక సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బిందాస్,రగడ చిత్రాల దర్శకుడు వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి 'ఫ్రెండ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. అలాగే రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలోనూ సునీల్ మరో చిత్రానికి కమిటయ్యారు.


Click it and Unblock the Notifications











