రోటీన్‌కి భిన్నంగా సునీల్ సినిమా షూటింగ్
హైదరాబాద్: మన తెలుగు సినిమాల దర్శక నిర్మాతలు, హీరోలు పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ లొకేషన్లను ప్రిఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏ టాప్ హీరో చూసినా స్విట్జర్లాండ్, ఇటలీ, టర్కీ, ఫ్రాన్స్ అంటూ రోటీన్ లొకేషన్లు ఎంచుకుంటుంటే హీరో సునీల్ మాత్రం రష్యా ప్రకృతి అందాలపై కన్నేశాడు.
సునీల్, ఇషాచావ్లా కాంబినేషన్‌లో పూలరంగడు తర్వాత బాలీవుడ్ మూవీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్‌గా 'రాధా కృష్ణుడు' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవీ ప్రసాద్ దర్శకత్వంలో ఈచిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై ఎన్.వి. ప్రసాద్, పరాస్‌జైలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ రష్యాలో ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్ర దర్శకుడు దేవి ప్రసాద్ గతంలో సూపర్‌గుడ్ ఫిలింస్ బేనర్‌లో 'నువ్వు వస్తావని' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సునీల్‌కు సూటయ్యేలా స్క్రిప్ట్ తయారు చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉండాలని సమీర్ కెమెరామెన్‌గా ఎంపిక చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కడా మిస్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సునీల్ ఈచిత్రంతో పాటు తమిళ చిత్రం వెట్టై తెలుగు రీమేక్‌లో.... ఉదయశంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











